క్యూట్ బ్యూటీ కృతి శెట్టి కెరీర్ టాలీవుడ్ లో ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. శర్వానంద్ తో నటించిన చిత్రమే ఆమెకు లాస్ట్ చిత్రం. లక్కీ హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ముచ్చటగా మూడు సినిమాల తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. కానీ సక్సెస్ మాత్రం కృతి శెట్టి కి దూరమైపోయింది.
దానితో టాలీవుడ్ లో డోర్స్ క్లోజ్ అయ్యాయి. పక్క భాషల్లో హడావిడి చేసినా కృతి శెట్టి కి అస్సలు కలిసి రాలేదు. అయితే ఇప్పుడు ఈ భామకు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలినట్టుగా టాక్ వినిపిస్తుంది. మన శంకర వరప్రసాద్ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి తనకు కలిసొచ్చిన హీరోలు వెంకీ-కళ్యాణ్ రామ్ లతో సినిమా అనౌన్స్ చేసారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న అనిల్ రావిపూడి మిగతా నటుల ఎంపిక పై దృష్టి పెట్టారని.. అందులో భాగంగానే కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేసారనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తో కృతి శెట్టి రొమాన్స్ చేస్తుంది అంటున్నారు.
మరి టాలీవుడ్ లో కెరీర్ ముగిసింది అనుకున్న సమయంలో కృతి శెట్టి కి గనక అనిల్ రావిపూడి ఈ అవకాశం గనక ఇస్తే కృతి శెట్టి కి బంపర్ ఆఫర్ తగిలినట్టే.