Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కెరీర్ ని శాసించిన కొడాలి నాని


వి.వి.వినాయక్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది అప్పట్లో బ్లాక్ బస్టర్ మాస్ హిట్ గా నిలవడమే కాదు ఎన్టీఆర్ ని మాస్ ప్రేక్షకుల దగ్గరకు చేర్చిన చిత్రం. ఆది తర్వాత ఎన్టీఆర్ స్టార్ట్ స్టేటస్ కి మారిపోయాడు. అసలు ఎన్టీఆర్ తో ముందు ఆది చిత్రం అనుకోలేదట. కొడాలి నాని ఎన్టీఆర్ కి మాస్ కథ కావాలని అడిగితేనే వినాయక్ ఆది కథను ఎన్టీఆర్ కి చెప్పి సినిమా చేసాడట. 

Advertisement
CJ Advs

తాజాగా వినాయక్ ఓ ఇంటర్వ్యూలో ఆది తర్వాత ఎన్టీఆర్ తో పరిటాల రవి (లేట్ టీడీపీ నేత) ఓ సినిమా చేద్దామనుకున్నారు. శ్రీరాములయ్య తర్వాత పరిటాల రవి నిర్మాతగా ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి సినిమా చేద్దామనుకుంటే దానిని కొడాలి నాని చెడగొట్టారు. అప్పటికి ఎన్టీఆర్-కొడాలి నాని మంచి ఫ్రెండ్స్, ఎన్టీఆర్ కెరీర్ విషయంలో కొడాలి నాని కేరింగ్ గా ఉండేవారు. పరిటాల రవి కూడా అప్పటికి పవర్ ఫుల్ రాజకీయనాయకుడు, అప్పట్లో ఆయన క్రేజ్ మాములుగా ఉండేది కాదు.

కానీ కథ నచ్చకో, లేదంటే దర్శకుడు నచ్చకో అప్పట్లో కొడాలి నాని పరిటాల రవి చేస్తాను అన్న మూవీ ని ఎన్టీఆర్ తో చెయ్యనివ్వలేదు అంటూ వినాయక్ సెన్సేషనల్ విషయాలు బయట పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్-కొడాలి ఫ్రెండ్స్, వినాయక్-ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అదుర్స్ చిత్రానికి నిర్మాతగా ఉన్నాడు. అప్పట్లో కొడాలి, వల్లభనేని వంశి, ఎన్టీఆర్ దోస్త్ అన్న విషయం అందరికి తెలిసిందే.

ఎన్టీఆర్ కి రైట్ హ్యాండ్ కొడాలి, లెఫ్ట్ హ్యాండ్ వంశి అన్నట్టుగా వ్యవహరించేవారు. మరి ఎన్టీఆర్ కెరీర్ ని అప్పట్లో కొడాలి నాని నే శాసించేవాడని వినాయక్ మాటలను బట్టి అర్ధమవుతుంది. 

V. V. Vinayak Reveals Paritala Ravi Once Planned a Film with NTR:

After Aadi, Paritala Ravi reportedly attempted to produce a film with Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs