Advertisement
Google Ads BL

అఖిల్ మౌనం - కంగారులో అక్కినేని ఫ్యాన్స్


అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తారా అని అక్కినేని అభిమానులు వెయిట్ చెయ్యని రోజు లేదు. అది మే 1 కి ఉంటుంది కదా అని చాలా ఆశపడితే.. ఇప్పుడు ఆ ఆశ అడియాస అయ్యేలా ఉంది. కారణం అఖిల్ లెనిన్ మే 1 నుంచి వాయిదా పడేలా కనబడుతుంది. పెద్ది ఏప్రిల్ 30 అంటూ అనౌన్సమెంట్ రావడం మొదలు లెనిన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. 

Advertisement
CJ Advs

మరోపక్క పెద్ది ఏప్రిల్ 30 కి రాకపోవచ్చనే ఊహాగానాల నడుమ అక్కినేని ఫ్యాన్స్ అలెర్ట్ అవుతున్నారు. లెనిన్ ని ముందు అనుకున్నట్టుగా మే 1 కి దించితే అదిరిపోతోంది అనేది వాళ్ళ ఆలోచన. ఎలాగూ పెద్ది రాకపోవచ్చు, అందుకే ముందు అనుకున్నట్టుగా లెనిన్ ని మే 1 కి రిలీజ్ చేస్తే బావుంటుంది అంటున్నారు.

కానీ లెనిన్ మేకర్స్ మాత్రం సైలెంట్ గా కనిపించడం, అఖిల్ కూడా బయటకనిపించకపోవడం అక్కినేని అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు సైలెంట్ గా షూటింగ్ చెయ్యడమే కానీ లెనిన్ పై హడావిడి చూపించడం లేదు, అసలే ప్రమోషన్స్ తో పడేస్తున్న రోజులివి. అది చూసి అయినా లెనిన్ మేలుకోకపోతే ఎలా అనేది అక్కినేని అభిమానుల బాధ. 

Lenin Movie update:

Akhil Lenin Movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs