Advertisement
Google Ads BL

డబ్బింగ్ సినిమాపై ఎందుకింత ప్రేమ


నిజంగా డబ్బింగ్ సినిమాకి ఆడియన్స్ కనెక్ట్ అయితే ఎంత ప్రేమ చూపిస్తారో అనేది ధురంధర్ 2 తెలుగు థియేటర్స్ కి వెళ్లి చూస్తే తెలుస్తుంది. హిందీలో తెరకెక్కిన ధురంధర్ ద రివెంజ్ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ విజిల్స్ కొడుతూ, కేకలు పెడుతూ ఎంజాయ్ చెయ్యడం చూసి భాష ఏదైనా మనం ఇండియన్స్ మే కదా.. అని అనిపించకమానదు. 

Advertisement
CJ Advs

అందుకే ధురంధర్ 2 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవడమే కాదు థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యడం నిజంగా హర్షించదగిన విషయమే. మంచి సినిమా అయితే ఏ భాష అయినా చూసి తీరాల్సిందే. అది కూడా కామ్ గా కాదు థియేటర్స్ లో రచ్చ చేస్తూ.. రణ్వీర్ ని చూసి, మాధవన్ ఎంట్రీ సీన్ లోను, ధురంధర్ ట్విస్ట్ లు రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు మాములుగా ఎంజాయ్ చెయ్యట్లేదు.

ఇక వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లోను ధురంధర్ 2 థియేటర్స్ 90 శాతం అక్యుపెన్సీతో కళకళలాడడం మాములు విషయం కాదు. అంతలా తెలుగు ప్రేక్షకులను ధురంధర్ మాయ చేసింది. టైటిల్ కార్డ్స్ పడినా థియేటర్స్ నుంచి జనాలు కదల్లేదు, ఇంకేం చూపిస్తారో అనే క్యూరియాసిటీ ప్రతి ఆడియన్స్ లో కనిపించింది.

తెలుగు ప్రేక్షకులు ధురంధర్ 2 ని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టడం చూసి ఓ డబ్బింగ్ సినిమాపై ఎందుకింత ప్రేమ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

Dubbing movie:

Dhurandhar 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs