కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్ ఆ చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నారు. రీసెంట్ గానే తమ్ముడు అల్లు శిరీష్ వివాహ వేడుకల్లో పాల్గొని, తర్వాత భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఓ చిన్నపాటి ట్రిప్ వేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ తన తడుపరి మూవీని కూలి దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అనౌన్స్ చేసారు.
అయితే లోకేష్ కనగరాజ్ కి సంబందించిన ఏకే-47 తుపాకులు తమిళనాడు పోలీస్ లకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఏకే-47 తుపాకులు దొరకడంతో అవాక్కయ్యారు, కానీ అవి డమ్మీ తుపాకులు అని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.
చెన్నై అశోక్ నగర్ లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ మినీ వ్యాన్ ని తనిఖీ చేయగా అందులో ఏకే-47 రకం తుపాకులు కనిపించాయి. దానితో షాకయినా పోలీసులు ఆ వ్యాను డ్రైవర్ మహేంద్రన్ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా అవి డమ్మీ తుపాకులని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ సినిమా చిత్రీకరణలో వాటిని వాడుకుని, తర్వాత వడపళనిలోని దుకాణంలో అప్పగించడానికి తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
అంతేకాకుండా ఆ తుపాకులకు సంబందించిన తగిన పత్రాలను సమర్పించడంతో ఆ వ్యానును విడిచిపెట్టారు.