టాలీవుడ్ దర్శకులకు సీక్వెల్ ట్రెండ్ పట్టుకుంది. బాహుబలి, పుష్ప చిత్రాలు వర్కౌట్ అయినట్టుగా పార్ట్ 2 చేసిన చాలామంది దెబ్బతిన్నారు. ముఖ్యంగా సీక్వెల్ ప్రకటించి దాని కోసం ఏళ్లతరబడి వెయిట్ చేయించడం.. పార్ట్ 1 కి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి హీరోకి ఎలివేషన్స్ పెంచేసి కంటెంట్ పై దృష్టి పెట్టకపోవడం ఇవన్నీ చూస్తున్నాం.
సీక్వెల్ ట్రెండ్ ఫాలో అవ్వాలి అంటే.. దానికి ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు హిందీలో తెరకెక్కిన ధురంధర్ నే తీసుకోండి. పార్ట్ 1 రిలీజ్ అయ్యాక కేవలం మూడున్నర నెలల కాలంలోనే పార్ట్ 2 ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తెచ్చేసాడు. పార్ట్ 1 హిట్టయ్యింది కదా అని అతిగా టైమ్ తీసుకోలేదు. హీరో ఎలివేషన్స్ లేవు, కంటెంట్ ని నమ్ముకున్నాడు, భారీ హైప్ ఉంది, ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టలేదు.
కానీ ధురంధర్ 2 ఓపెనింగ్స్ లో దుమ్మురేపింది. అదే టాలీవుడ్ సీక్వెల్స్ చూస్తే పార్ట్ 1 వచ్చాక ఏళ్ళ తరబడి సెకండ్ పార్టు ని చెక్కడం, విడుదలకు ముందు భారీగా ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టడం, హీరో ని ఎలివేట్ చేసేందుకు టైమ్ తీసుకోవడం ఇవన్నీ బడ్జెట్ మితిమీరి పెరిగి నిర్మాతలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి.
ధురంధర్ పార్ట్ 1 వచ్ఛాక మూడున్నర నెలల గ్యాప్ లో పార్ట్2 విడుదల చేసారు. విడుదలలో జాప్యం లేదు. పార్ట్ 1 హిట్ అయ్యింది పార్ట్2 కోసం సమయం తీసుకుని హీరో కి స్పెషల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ పెడదామని దర్శకుడు అనుకోలేదు, అనుకున్న సమయానికి టీజర్, ట్రైలర్ వదిలారు. ప్రమోషన్స్ కోసం డబ్బు వేస్ట్ చెయ్యలేదు.
కథను నమ్మాడు, దానికే కట్టుబడి ఉన్నాడు. ఇక కలెక్షన్స్ కోసం టికెట్ రేట్లు పెంచలేదు. ముఖ్యంగా విడుదల వాయిదాలు వెయ్యలేదు. ఇవే ప్రత్యేకంగా ఆడియన్స్ ధురంధర్ 2పై క్రేజ్ పెరగడానికి కారణమైంది. మరి ఇది చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలనే డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.