Advertisement
Google Ads BL

ధురంధర్ 2 - బాలీవుడ్ సైలెంట్


 

Advertisement
CJ Advs

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ పార్ట్ 1, ధురంధర్ పార్ట్ 2 రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. నార్త్ లోనే పార్ట్ 1 రూ.1000 కోట్లకు పైగా వసూలు చెయ్యగా.,. ఇప్పుడు ధురంధర్ ద రివెంజ్ పాన్ ఇండియా భాషల్లో విడుదలై దౌడ్ తీస్తుంది. ఎవరి నోట విన్నా ధురంధర్ మాటే.

సెలబ్రిటీస్ లేరు, కామన్ ఆడియన్స్ లేరు. ప్రతి ఒక్కరూ ధురంధర్ 2 చూడాలి అనే కోరిక. చూసాక దానిని గురించి మాట్లాడాలనే ఆత్రుత. ముఖ్యంగా సౌత్ సెలబ్రిటీస్ ధురంధర్ 2 చూసి దర్శకుడిని, హీరోని, మేకర్స్ ని ఇలా ప్రతి ఒక్కరిని అప్రిశేట్ చేస్తూ సోషల్ మీడియాలో వేస్తోన్న ట్వీట్స్ చూసి ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, రాజమౌళి, నాగార్జున, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలా టాప్ సెలబ్రిటీస్ ధురంధర్ 2 చిత్రాన్ని వీక్షించి మరీ ట్వీట్లు వేస్తూ ఆదిత్య ధర్ ని పొగుడుతున్నారు. రజిని ట్వీట్ కి ఆదిత్య ధర్ రిప్లై ఇస్తూ మీ ప్రశంశ ఓ వరం అంటూ కామెంట్ చేసారు.

ఇంతిలా ఓ హిందీ మూవీని సౌత్ సినిమావాళ్లు పొగుడుతుంటే.. బాలీవుడ్ మొత్తం సైలెంట్ గా వేడుక చూస్తుంది. ఒక్క స్టార్ హీరో నుంచి కూడా ధురంధర్ 2 కి ఎలాంటి ప్రశంశ దక్కలేదు. ఏ ఒక్కరూ ధురంధర్ 2 తప్పక చూడాల్సిన చిత్రమని చెప్పడం లేదు. మరి తమ సినిమాని తామే పట్టించుకోకపోతే ఎలా అంటూ బాలీవుడ్ మీడియా, నెటిజెన్స్ చేస్తున్న కామెంట్స్ హైలెట్ అవుతున్నాయి.  

Why Bollywood Silent On Dhurandhar 2 Success:

Bollywood Silent On Dhurandhar 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs