పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమాలకు విరామం ఇచ్చి వకీల్ సాబ్ రీమేక్ తో కమ్ బ్యాక్ అయ్యాక ఆ చిత్రం చూసి ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. అది రీమేక్ కావడం, సినిమా కి హిట్ టాక్ రావడంతో నిర్మాత సేఫ్ అయ్యాడు. ఆతర్వాత భీమ్లా నాయక్ కూడా రీమేక్. ఆ చిత్రానికి కూడా మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయింది.
ఆతర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి గెస్ట్ రోల్ చేసిన బ్రో చిత్రము ఆడలేదు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG మూడు చిత్రాలను ఒకేసారి సెట్ పైకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చెయ్యడానికి ఏళ్ళ తరబడి సమయాన్ని తీసుకున్నారు. ఆయన డేట్స్ ఇచ్చినప్పుడు సినిమాలను హరిబరిగా పూర్తి చేసి ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు.
హరి హర వీరమల్లు గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శలు ఈమధ్య కాలంలో మరే ఇతర సినిమాపై రాలేదు. ఆతర్వాత వచ్చిన OG మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసినా కామన్ ఆడియన్స్ ని నిరాశపరిచింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్.. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో నడుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కి యావరేజ్ టాక్ రావడము, ధురంధర్ 2 దూకుడు చూపించడంతో ఉస్తాద్ కలెక్షన్స్ విషయంలోనూ సస్పెన్స్ మొదలయ్యింది.
మరి పవన్ కళ్యాణ్ తో సినిమాలు అంటే దర్శకనిర్మాతలకు సహనం మాత్రమే కాదు డబ్బు కూడా దండిగా ఉండాల్సిందే. సెట్ లు వేసి అవి పాడయ్యి మళ్లీ వేస్తె అది ప్రొడ్యూసర్స్ కి తలకి మించిన భారం. పవన్ తో సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాదు అనేది స్పష్టత వచ్చేసింది. ఇకపై ఆయనతో సినిమా చేసేవాళ్ళు అన్నిటికి సిద్దపడి చెయ్యాల్సిందే.