Advertisement
Google Ads BL

బాలయ్య వెనక్కి తగ్గుతారా..


 

Advertisement
CJ Advs

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని చేస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో NBK 111 షూటింగ్ జరుగుతుంది. అయితే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని ఆదిత్య 999 చేస్తారా లేదంటే.. హరీష్ శంకర్ తో సినిమా చేస్తారా అనే డైలమాలో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నప్పుడే హరీష్ శంకర్ బాలయ్య కు కథ చెప్పి ఒప్పించారని, గోపీచంద్ మలినేని సినిమా తో పాటుగా హరీష్ శంకర్ సినిమా కూడా పట్టాలెక్కిస్తారనే ప్రచారం మాములుగా జరగలేదు. కానీ ఇప్పుడు అంటే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యాక బాలయ్య హరీష్ శంకర్ తో సినిమా చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారనే టాక్ వినబడుతుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలకు మించి హిట్ అవుతుంది అనుకుంటే.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లుక్స్ పై పెట్టిన ఎఫర్ట్స్ కంటెంట్ పై పెట్టలేదు. ఫ్యాన్స్ కి పవన్ వింటేజ్ స్టయిల్ నచ్చినా ఉస్తాద్ రిజల్ట్ డిజప్పాయింట్ అయ్యేలా చేసింది. అందుకే ఉస్తాద్ ఎఫెక్ట్ తో బాలయ్య, హరీష్ శంకర్ మూవీ విషయంలో వెనక్కి తగ్గుతారని అంటున్నారు.

Will Balakrishna Stepped Back:

&nbsp; <p class="MsoNormal">Will Balakrishna Take This Risk With Harish &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs