ధురంధర్ 2 సునామి నుంచి కన్నడ స్టార్ యశ్ తృటిలో తప్పించుకున్నాడు. యశ్ టాక్సిక్ కూడా మార్చ్ 19 కి వస్తుంది అని గత ఏడాదే ఫిక్స్ అయ్యారు. ధురంధర్ 2 వస్తుంది అని పెద్ద పెద్ద సినిమాలు తప్పుకున్నా యశ్ టాక్సిక్ మాత్రం మార్చ్ 19 నే వస్తుంది అని మేకర్స్ చాలా గట్టిగా పట్టుబట్టుకుని కూర్చున్నారు.
ఇక టాక్సిక్ ట్రైలర్ వస్తుంది అనుకున్న సమయంలో ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం వలన ఓవర్సీస్ మార్కెట్ దెబ్బతింటుంది అందుకే టాక్సిక్ ని జూన్ కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. నిజంగా లాస్ట్ మినిట్ లో యశ్ పోస్ట్ పోన్ డెసిషన్ తీసుకోవడం వలనే ధురంధర్ 2 సునామి నుంచి టాక్సిక్ మేకర్స్ బయటపడ్డారు.
ప్రస్తుతం ధురంధర్ ద రివెంజ్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ ని దుల్లగొట్టేస్తుంది. హిందీ లేదు తెలుగు లేదు, తమిళ, మలయాళ, కన్నడ ఎక్కడ చూసినా ధురంధర్ 2 డామినేషన్ కనిపిస్తుంది. టాక్సిక్ కి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా దానికి నార్త్ లో ధురంధర్ దెబ్బ బాగా పడేది. అలానే మిగతా లాంగ్వేజెస్ లోను ధురంధర్ 2 టాక్సిక్ ని పాడుకోబెట్టేసేది. సో యశ్ టాక్సిక్ నిజంగా తృటిలో తప్పించుకుంది అనే చెప్పాలి.