మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ధురంధర్ దూకుడు కి మనం అడ్డెందుకు అనుకుని మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 30 డేట్ లాక్ చేసారు. కాకపోతే ధురంధర్ 2 రీజన్ కన్నా ముందు పెద్ది కి సంబందించిన షూటింగ్ పూర్తి కాకపోవడము ఓ కారణమనుకోండి. పెద్ది మార్చి 27 వదిలెయ్యడమే తరువాయి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 రిలీజ్ అంటూ మేకర్స్ డేట్ లాక్ చేశారు.
అంతా బాగానే ఉంది. హరీష్ శంకర్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. మార్చి 19 విడుదలవుతున్న ధురంధర్ 2, యష్ టాక్సిక్ ల హవా వారంలోనే సర్దుకుంటుంది అని మేకర్స్ కూడా ఉస్తాద్ ని ధైర్యంగా మార్చ్ 26 కి ఫిక్స్ చేసారు. అయితే టాక్సిక్ ఎప్పుడైతే మార్చ్ 19 నుంచి వెనక్కి వెళ్లిందో నిమిషాల మీద ఉస్తాద్ భగత్ సింగ్ ని ధురంధర్ 2 తో పోటీ పడుతున్నట్టుగా ప్రీ పోన్ చేస్తూ అనౌన్స్ చేసి షాకిచ్చారు.
ఉస్తాద్ పై ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా భారీ అంచనాలున్న ధురంధర్ 2 పైకి వదలడం ఎంతవరకు కరెక్ట్ అటూ హరీష్ శంకర్ ని చాలా ఇంటర్వూస్ లో అడిగారు. అబ్బె అదేం లేదు, ధురంధర్ 2 ని పోటీ అనుకోవడం లేదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ని మార్చ్ 19 ధురంధర్ కి పోటీగా విడుదల చెయ్యకుండా ఉండాల్సింది అనే భావన ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.
ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రీ పోన్ చేసి మేకర్స్ పెద్ద మిస్టేక్ చేసారు. మార్చ్ 26 కి ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసి ఉంటే కలెక్షన్స్ వేరేలా ఉండేవి. ధురంధర్ 2 ధాటికి ఉస్తాద్ అనుకున్న కలెక్షన్స్ తేవడం కష్టమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఉస్తాద్ కాస్ట్లీ మిస్టేక్ ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా..