Advertisement
Google Ads BL

గొప్ప ఛాన్సే కానీ డైల‌మాలో మృణాల్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది లో ఐటం భామ‌గా మృణాల్ ఠాకూర్ పేరు బ‌లంగా వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎంతో మంది స్టార్ భామ‌లున్నా?  వారంద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి మ‌రీ మృణాల్ వైపు మేక‌ర్స్ మొగ్గు చూపుతున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వెడెక్కిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. ఈ అవ‌కాశం పట్ల మృణాల్ సానుకూలంగా స్పందించాలా? లేక సున్నితంగా తిరస్కరించాలా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ సరసన రెహమాన్ లాంటి దిగ్గ‌జం అందిం చిన పాట‌కు డాన్సు చేయాలంటే? ఆ న‌టి  అదృష్ట‌వంతురాలై ఉండాలి. ఎంతో కాంపిటీష‌న్ న‌డుమ ఎంపికైతే ఏ న‌టి అయినా అవ‌కాశాన్ని అదృష్టంగా భావిస్తారు.  ఇలాంటి స్పెషల్ సాంగ్  తో తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించే అవకాశం లభిస్తుంది. పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న చరణ్‌తో ఆడిపాడితే అది ఆమె కెరీర్‌కు కమర్షియల్‌గా పెద్ద ప్లస్ అవుతుందని ఒక వర్గం అభిప్రాయపడుతోంది.

కానీ మృణాల్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో ఒక క్లాసిక్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వస్తోంది.  అలాంటి న‌టి ఒక్కసారిగా ఐటమ్ సాంగ్ చేస్తే భవిష్యత్తులో తన వద్దకు వచ్చే కథల విషయంలో ఆ ఇమేజ్ దెబ్బతింటుందేమోనని ఆమె భయపడుతోందని వినిపిస్తోంది. ముఖ్యంగా పాన్-ఇండియా లెవల్‌లో మెయిన్ హీరోయిన్ ఛాన్సులు దెబ్బతినే ప్రమాదం ఉందనే నెగిటివ్ యాంగిల్‌లో కూడా అమ్మ‌డు  ఆలోచిస్తోంది.

బేసిక్ గానే మృణాల్ చాలా సెల‌క్టివ్ గా ఉంటుంది. బ‌ల‌మైన పాత్ర‌లైతే గానీ క‌మిట్ అవ్వ‌దు. చ‌ర‌ణ్ లాంటి స్టార్ స‌ర‌స‌న ఛాన్స్ వ‌దుల‌కోవ‌డం అన్న‌ది తెలివి త‌క్కువ ప‌ని కాదు.  ఇలా పాజిటివ్ -నెగిటివ్ అంశాల మధ్య  మృణాల్ నలిగిపోతంది. అందుకే అవ‌కాశం వ‌చ్చినా ఇంకా ఎలాంటి  నిర్ణయం తీసుకోలేకపోతోందని తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడానికి వెనుకాడతారు. ఒకవేళ ఒప్పుకుంటే అది సంచలనమే అవుతుంది. కానీ తిరస్కరిస్తే మాత్రం ఒక భారీ ప్రాజెక్టును వదులుకున్నట్లవుతుంది.ఈ డైలమా కారణంగానే చిత్ర యూనిట్‌కు కూడా ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మ‌రి పెద్ది సినిమాలో మృణాల్ ఠాకూర్ మెరుస్తుందా ?  లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Mrunal Thakur:

Mrunal Thakur - Peddi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs