అసలు ధురంధర్ 2 చిత్రం కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేసారో.. ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఫస్ట్ వీకెండ్ లో రూ. 750 కోట్ల షేర్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం అంటే కేవలం నాలుగు రోజుల్లోనే ధురంధర్ ద రివెంజ్ ఈ రేంజ్ దూకుడు చూపించింది.
అయితే వీకెండ్ కదా ఆ ఫ్లోలోనే ధురంధర్ 2 ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది, వీక్ డేస్ లో అందులోను వర్కింగ్ డే సోమవారం ధురంధర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనుకుంటే.. వీకెండ్ లేదు, వీక్ డేస్ లేదు.. ధురంధర్ 2 చూద్దామని బుక్ మై షో ఓపెన్ చేస్తే సోమవారం కూడా బుకింగ్స్ ఫుల్ అవడం నిజంగా ఆశ్చర్యమే.
సోమవారం వర్కింగ్ డే, అయితే నైట్ షోస్ ఫుల్ అవుతాయని అనుకుంటే.. డే లోను థియేటర్స్ ప్రేక్షకుల తో కళకళలాడుతున్నాయి. ఓ రెండు వారాల పాటు ఈ క్రేజ్ ఉంటుందో.. లేదంటే రెండు నెలల పాటు ధురంధర్ 2 ఇదే లెక్కన దూకుడు చూపిస్తుందో అనేది చూడాలి.