Advertisement
Google Ads BL

పెద్ది రావట్లేదని హింట్ ఇచ్చారా..


 పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ డేట్ పై ఎన్నో అనుమానాలు, మరెన్నో వార్తలు. ఏప్రిల్ 30 కి పెద్ది చిత్రం వచ్చే ఛాన్స్ లేదు అనే మాట సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది. ఇంకా పెద్ది షూటింగ్ పూర్తి కాలేదు, స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని హరిబరిగా జరగడమే అందరిలో అనుమానాలు రేకెత్తించాయి.

Advertisement
CJ Advs

కానీ మేకర్స్ ఏప్రిల్ 30 నే పెద్ది రిలీజ్ అంటున్నారు. ఈలోపే తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ మే 1కి అని ఫిక్స్ చేశారు. అంటే గాయపడ్డ సింహం మేకర్స్ కి పెద్ది రావట్లేదు అని తెలుసా, తెలిసే ఇలా మే 1 కి రిలీజ్ డేట్ లాక్ చేసారా.. పెద్ది పోస్ట్ పోన్ అనే హింట్ ఇలా ఇచ్చారా అనే విషయం మెగా ఫ్యాన్స్ ని అయోమయంలో పడేసింది.

అదేంటి పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న వస్తుంది కదా.. అలాంటప్పుడు గాయపడ్డ సింహాన్ని ఎలా రిలీజ్ చేస్తున్నారని మీడియా వారు అడిగితె..  ఒకవేళ పెద్ది వస్తే ఒక వారం వెనక్కి జరపాలని ముందుగానే చెప్పేశాను, గాయపడ్డ సింహాన్ని వాయిదా వేయకపోతే మళ్ళీ నన్ను ఏసుకుంటారు.. దిల్ రాజు చిన్న సినిమాని తొక్కేస్తున్నాడు అంటూ దిల్ రాజు గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో చెప్పడం హైలెట్ అయ్యింది.

మరి ఏప్రిల్ 25 వరకు పెద్ది విషయంలో సస్పెన్స్ తప్పేలా లేదు. ఏప్రిల్ 30 కి వస్తుందా లేదా అనేది. 

Gaayapadda Simham Announces Its Arrival:

Gaayapadda Simham Set to Release on May 1st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs