Advertisement
Google Ads BL

టాలీవుడ్ కోరియోగ్రాఫ‌ర్ కి హాలీవుడ్ ఛాన్సా


భారతీయ సినీ కీర్తిని `నాటు నాటు` పాటతో ఆస్కార్ వేదికపై రెపరెపలాడించిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు హాలీవుడ్ గడప తొక్కబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. దిగ్గజ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ కొరియో గ్రాఫర్ విన్సెంట్ పీటర్సన్ స్వయంగా ప్రేమ్ రక్షిత్ ప్రతిభను గుర్తించి ఓ భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆహ్వానిం చినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే? అంతర్జాతీయ స్థాయి కొరియోగ్రాఫర్ నుండి ఇలాంటి పిలుపు రావడం భారతీయ నృత్య శైలికి దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు.

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో పుట్టి పెరిగిన ప్రేమ్ రక్షిత్ సినిమాలపై మక్కువతో హైదరాబాద్ చేరుకుని అంచలంచెలుగా ఎదిగారు. ఎనర్జిటిక్ మరియు కాంప్లెక్స్ స్టెప్పులతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఆయన ఇప్పుడు హాలీవుడ్ అగ్రశ్రేణి నటులు , డాన్సర్లతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే? హాలీవుడ్ తెరపై ఇండియన్ స్టైల్ మార్కును వేసిన మొదటి భారతీయ కొరియోగ్రాఫర్‌గా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

ప్రస్తుతానికి ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ అత్యంత గోప్యంగా ఉంచిన‌ట్లు తెలు స్తోంది. ప్రేమ్ రక్షిత్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తు న్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఆస్కార్ విజేతగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు అవ్వడం ఖాయం. హాలీవుడ్ తెరపై ప్రేమ్ రక్షిత్ కంపోజిషన్ చూసే అవకాశం వస్తుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు

Tollywood to Hollywood:

Tollywood choreographer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs