Advertisement
Google Ads BL

ఏపీ లో హాట్ టాపిక్‌గా అంధభక్త్ కామెంట్!


రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అంశం ఏదైనా స్పందించ‌డం ఆమె నైజం తాజాగా రేణు చేసిన వ్యాఖ్యలు  రాజకీయ , సినీ వర్గాల్లో  సంచలనం రేపుతున్నాయి.

Advertisement
CJ Advs

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, బీజేపీ సిద్ధాంతాలను ప్రశంసిస్తూ తాను `ఒక గర్వపడే అంధభక్తురాలిని` అని ఆమె బహిరంగంగా ప్రకటించడం విశేషం. ఇటీవల విడుదలైన `ధురంధర్ 2` సినిమాను వీక్షించిన అనంతరం అందులోని ఓ కీలక సన్నివేశాన్ని ఉటంకిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో దావూద్ ఇబ్రహీంను పోలిన విలన్ పాత్ర `దేశంలో చాయ్‌వాలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనవారిలో భయం పెరిగింది` అని చెప్పే డైలాగ్‌ను రేణు దేశాయ్ ప్రత్యేకంగా హైలైట్ చేశారు. `చాయ్‌వాలా కా జల్వా` అనే క్యాప్షన్‌తో ఉన్న వీడియోను రీషేర్ చేస్తూ.. ప్రధాని మోదీ పట్ల తనకున్న  అభిమానాన్ని చాటుకున్నారు. మన దేశ సైనిక దళాలు, నిఘా ఏజెన్సీల త్యాగాల వల్లే మనం ఇళ్లలో ప్రశాంతంగా ఉంటున్నామని, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని  పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలో ఉండటం.. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో రేణు దేశాయ్ ఇలా నేరుగా మోదీకి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె చేసిన ఈ `అంధభక్తురాలు` అనే కామెంట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ రేణు దేశాయ్ మాత్రం తన రాజకీయ మొగ్గును ఎక్కడా దాచుకోకుండా స్పష్టంగా, ధైర్యంగా వెల్లడించడం విశేషం.

Renu Desai calls herself proud andhbhakt of PM Modi:

Renu Desai praised Dhurandhar 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs