మార్చ్ 19 న హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రావడంతో ధురంధర్ 2 కోసం వెయిట్ చేసిన తెలుగు ఆడియన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అయినప్పప్పటికీ కొంతమంది ధురంధర్ 2 హిందీ వెర్షన్ ని వీక్షించారు. తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. నిన్న శనివారంతో ఆ సస్పెన్స్ తీరి ధురంధర్ 2 తెలుగు వెర్షన్ తో విడుదలయింది.
ధురంధర్ 2 విడుదలవుతుంది అని తెలియడం, బుక్ మై షో లో ధురంధర్ 2 కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడ్డారు. బుక్ మై షో లో టికెట్స్ ఓపెన్ చెయ్యగా టికెట్స్ సోల్డ్ అవుట్ అవడం చూసి మరింతగా తెలుగు ఆడియన్స్ నిరాశపడ్డారు. ఎప్పుడెప్పుడు ధురంధర్ 2 ని తెలుగులో చూద్దామా అని వెయిట్ చేసిన వారికి టికెట్స్ దొరక్క నీరుగారిపోయారు.
కేవలం మల్టిప్లెక్స్ తప్ప బిసి సెంటర్స్ లో ధురంధర్ ద రివెంజ్ ఆడదని చాలామంది అన్నప్పటికీ.. ధురంధర్2 దూకుడు ప్రతి థియేటర్ లో కనిపిస్తుంది. అంతేకాదు స్క్రీన్స్ పెంచమని బయ్యర్లు కు డిమాండ్స్ వస్తున్నాయి. ఉస్తాద్ ఉన్నా ముందు ధురంధర్ 2 చూడాలని ప్రేక్షకులు వెయిట్ చెయ్యడమే ఇందుకు కారణమంటున్నారు.
తెలుగు లో రాకముందే హిందీ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులు నాలుగు గంటల నిడివిని మళ్లీ తెలుగులో చూసేందుకు వెళుతున్నారు అంటే ధురంధర్ 2 క్రేజ్ ఎంతగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఎక్కువ స్క్రీన్స్ గనక ధురంధర్ 2 కి ఇస్తే ఇక్కడ కూడా ఓ డబ్బింగ్ సినిమా రికార్డ్ లు క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ.