Advertisement
Google Ads BL

ఎట్ట‌కేల‌కు స‌మంత ఛాన్స్ కొట్టేసిందా


సమంత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ వెండితెర అరంగేట్రానికి సమయం ఆసన్నమైంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2`, `సిటాడెల్` వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన సత్తా చాటిన సామ్, ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రాబోతున్న భారీ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. `మిస్టర్ అండ్ మిసెస్ మాహి` ఫేమ్ శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

Advertisement
CJ Advs

సమంత కెరీర్ పరంగా ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, ఆమె మకాంను పూర్తిగా ముంబైకి మార్చేసింది. అక్కడ ఇప్పటికే ఒక ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసిన సామ్, భర్త ప్రోత్సాహం , బాలీవుడ్ పరిచయాలతో వరుస అవకాశాలకు రీచ్ అవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి హ్యాండ్సమ్ హీరో సరసన ఆమె జోడీ కడితే అది బాలీవుడ్‌లో ఒక క్రేజీ అండ్ ఫ్రెష్ కాంబినేషన్ కావడం ఖాయం.

అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ, సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హిందీ భాషపై పట్టు సాధించిన అమ్మ‌డు ఇప్పుడు వెండితెరపై తన నటనతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాలని ఆశపడుతోంది. శరణ్ శర్మ భావోద్వేగపూరిత కథాంశాలకు సామ్ నటన తోడైతే, ఆమె బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరు సహకారం, కరణ్ జోహార్ వంటి అగ్ర నిర్మాతల అండతో సమంత ఇకపై బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.

Samantha:

Samantha-Bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs