ఏపీ ఐటి, విద్య శాఖామంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తో ఏపీ ప్రజలకు ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించడమే కాదు 2024 ఎన్నికల్లో యువగళం పాదయాత్ర ప్రముఖ పాత్ర పోషించింది. యువగళం పాదయాత్రలో యువతతో కలిసి తిరిగిన లోకేష్ ప్రతి ఊరి సమస్యలను తెలుసుకుని శక్తికి మించిన సాయం చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి రాగానే నారా లోకేష్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతోమందికి సహాయం చేయడం తరచూ చూస్తున్నాం, వింటున్నాం.
సోషల్ మీడియా లో అయితే నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ సమస్యలు చెప్పుకుంటే నేనున్నాను అని నిలబటే నారా లోకేష్ మరోసారి తనిచ్చిన మాటను నిలబెట్టుకుని అందరితో శెభాష్ అనిపించుకున్నారు. గతేడాది రంజాన్ మాసంలో మంగళగిరిలో నిరుపేద ముస్లిం షెహన్ షా ఇంటికి వెళ్లిన మంత్రి లోకేష్ అక్కడ వారి దీనస్థితి చూసి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
మాటిచ్చిన ప్రకారమే నారా లోకేష్ ఏడాది పూర్తికాకముందే తన సొంత నిధులతో షెహన్ షా కుటుంబానికి ఇంటిని నిర్మించి రంజాన్ కానుకగా షెహన్ షాకు మంత్రి నారా లోకేష్ ఇంటిని ఇవ్వడం తెగ వైరల్ అవుతోంది.