రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది చిత్ర విడుదల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ వలన పెద్ది ఏప్రిల్ 30 న రాకపోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియా ని కమ్మేశాయి. షూటింగ్ పూర్తి కాలేదు, విఎఫెక్స్ వర్క్ పూర్తి కాలేదు, మరి పెద్ది చిత్రాన్ని మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
పెద్ది చిత్ర విడుదల లో విషయంలో నెలకొన్న ఈ సస్పెన్స్ ని చిత్ర బృందం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. రూమర్స్ ఆగడం లేదు. పెద్ది చిత్ర విడుదల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు అనేది ఆ చిత్ర షూటింగ్ ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్ లో క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఇంకో 4 రోజుల్లో టాకీ మొత్తం కంప్లీట్ అవ్వనుంది.
కా కపోతే రెండు సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది. రెండు సాంగ్స్ ని ఏప్రిల్ 6 నుంచి ఒక సాంగ్, 12 నుంచి మరో సాంగ్ షూట్ చేయనున్నారు. సో ఆ తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఏప్రిల్ 30 న పెద్ది ని గ్రాండ్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.