Advertisement
Google Ads BL

పవన్ సినిమాని తొక్కేసే ప్లాన్


అనుకున్నట్టుగానే వైసీపీ పార్టీ, అందుకు సంబందించిన బ్లూ మీడియా తన గేమ్ స్టార్ట్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సినిమాని తొక్కేసే ప్లాన్ ని ప్రోపర్ గా స్టార్ట్ చేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే సినిమాపై అస్సలు హైప్ లేదు, ధురంధర్2 దెబ్బకి ఉస్తాద్ కి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అంటూ స్టార్ట్ చేసింది.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19 న విడుదలైంది. ఎలాంటి ప్రీమియర్స్ లేకుండా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. హిట్ టాక్ వచ్చినా సినిమా బాలేదు అంటూ రివ్యూస్ ఇచ్చారు. కానీ మొదటిరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సత్తా చాటింది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే  కాదు యూత్ కూడా వింటేజ్ పవన్ ని చూసి ఎంజాయ్ చేసారు. 

పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ బాగా చూపించాడు, కంటెంట్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ లుక్స్ కి ఫిదా అయ్యారు. అది చూసిన బ్లూ మీడియా మొదటి రోజు ఉస్తాద్ బాత సింగ్ బాగానే ఉంది, కానీ రెండో రోజుకే వసూళ్లు పడిపోయాయి. రెండోరోజు దాదాపుగా 80 శాతం వసూళ్లు పడిపోయాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పనైపోయింది, ధురంధర్ 2 తెలుగు వెర్షన్ వచ్చేసింది.

ఇకపై ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ వంక ఎవరూ చూడరు, రెండు రోజులకే ఉస్తాద్ చేతులెత్తేసింది అంటూ రాస్తున్న న్యూస్ లు చూసి పవన్ సినిమాని పనిగట్టుకుని పడేసే ప్లాన్ బాగానే చేసారు, ఆల్రెడీ హిట్ టాక్ వచ్చిన ఉస్తాద్ ని ఇలాంటి వార్తలు ఏమి చెయ్యలేవు అంటూ పవన్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

Ustaad Bhagat Singh:

Pawan Kalyan - Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs