అక్కినేని నాగార్జున ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అనేది ప్రతి సందర్భంలో చూస్తూనే ఉన్నాము. కాకపోతే రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన రెండు పెద్ద వెడ్డింగ్స్ లో నాగ చైతన్య తన తండ్రి నాగార్జున, పిన్ని అమల తో కలిసి హాజరయ్యాడు. కానీ భార్య శోభిత ఎక్కడా కనిపించలేదు.
దానితో శోభిత ప్రెగ్నెంట్ అందుకే ఆమె ఎక్కడా కనిపించలేదు అంటూ చాలామంది లో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ శోభిత తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేందుకు గత రాత్రి జరిగిన గద్దర్ అవార్డ్స్ లో ట్రాన్స్పరెంట్ చీరకట్టులో కనిపించి షాకిచ్చింది. డిజైనర్ శారీ లో శోభిత చైతు పక్కన ప్రెట్టీ గా మెరిసింది.
అదిచూసి అక్కినేని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినా శోభిత ప్రెగ్నెంట్ కాదు అనేది మాత్రం తేటతెల్లమైంది. ఇక సిమెంట్ కలర్ చీర లో శోభిత న్యూ లుక్ మాత్రం డీసెంట్ గా ఆకట్టుకుంది.