రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కించిన ధురంధర్ చిత్రానికి సీక్వెల్ గా రేపు విడుదల కాబోతున్న ధురంధర్ ద రివెంజ్ చిత్ర ప్రీమియర్స్ షోస్ ఆల్మోస్ట్ ముగుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచే ధురంధర్ 2 హిందీ ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. అయితే ధురంధర్ 2 మిగతా లాంగ్వేజ్ ల ప్రీమియర్స్ క్యాన్సిల్ కాగా కేవలం హిందీ వెర్షన్ ప్రీమియర్స్ మాత్రమే పడ్డాయి.
హిందీ ధురంధర్ 2 ప్రీమియర్స్ చూసిన అందరూ సినిమా ఎక్సలెంట్, మాస్టర్ పీస్, రణ్వీర్ సింగ్ తన పెరఫార్మెన్స్ తో అరిపించేసాడు, ఆదిత్య ధార్ మేకింగ్ గురించి చెప్పడానికి మాటల్లేవ్, ఫస్ట్ హాఫ్ అద్భుతం, సంజయ దత్ నటన గురించి చెప్పేదేముంది, ధురంధర్ 2 ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ అన్ని అదుర్స్.
నాలుగు గంటలైనా బోర్ కొట్టదు. ధురంధర్ 2 మ్యూజిక్, BGM , సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని వేటికవే స్పెషల్. ఆదిత్య ధార్ డైరెక్షన్ ని అయితే పొగడకుండా ఉండలేకపోతున్నామంటూ ధురంధర్ 2 హిందీ వెర్షన్ ని వీక్షించిన ఆడియన్స్ వేస్తున్న ట్వీట్ల తో సోషల్ మీడియా షేక్ అవుతోంది.