Advertisement
Google Ads BL

త్రిష రాజకీయ అరంగేట్రం


ప్రస్తుతం సోషల్ మీడియాలో `త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నారు` అనే వార్త జోరుగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఆమె దివంగత ముఖ్యమంత్రి జయలలిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇదే సామాజిక వర్గ నేపథ్యం కారణంగా త్రిష ఇటీవల భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షాను కలిశారని.. త్రిష‌ నేరుగా భాజపా కూటమిలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ త్రిష టీవీకే అభ్యర్థిగా లేదా కీలక నాయకురాలిగా మారితే.. తమిళనాడు రాజకీయ చిత్రంలో త‌న పాత్ర పెద్ద‌గా ఉంటుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
CJ Advs

త్రిష రాజకీయ ప్రయాణానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం దళపతి విజయ్ మద్దతు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన విజయ్ స్నేహితురాలు త్రిషకు తన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణాలు .. సినిమా స్టార్‌లకు తమిళనాడులో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. త్రిష రాజకీయ అడుగులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఒకవేళ త్రిష అధికారికంగా రాజకీయాల్లోకి వస్తే.. అది కేవలం ఒక పార్టీకే కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుందని అభిమానులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా అమిత్ షాను త్రిష క‌ల‌వ‌డానికి కార‌ణం.. ద‌ళ‌ప‌తి విజ‌య్ తో భాజ‌పా పొత్తు కుదుర్చుకునేందుకేన‌నే చ‌ర్చ త‌మిళ పొలిటిక‌ల్ కారిడార్ లో కాక‌లు పుట్టిస్తోంది. 

Trisha Considering Politics:

Trisha Considering Politics-To Join TVK
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs