Advertisement
Google Ads BL

ఏది ఉగాది హడావిడి


రేపు గురువారం మార్చి 19 న ఉగాది. ఉగాది అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం. ఇదే రోజు ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు తెలుగువారు శుభప్రదంగా భావిస్తే.. సినీపరిశ్రమ కొత్త సినిమాల అప్ డేట్స్ తో ఉగాది కి కలకళలాడుతూ కనిపిస్తుంది. కొత్త సినిమా పూజా కార్యక్రమాలు, అలాగే కొత్త సినిమాల టీజర్స్, రిలీజ్ డేట్స్ ఇలా ఏదో ఒక అప్ డేట్ ని ఉగాది స్పెషల్ గా వదులుతారు దర్శకనిర్మాతలు.

Advertisement
CJ Advs

రేపు రాబోయే ఉగాది కోసం చాలామంది హీరోల ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే మెగస్టార్ చిరు ఫ్యాన్స్ అందరికన్నా, అన్నిటికన్నా ఎక్కువగా ఉగాది ఫెస్టివల్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. #NTRNeel మూవీ అప్డేట్ కోసము, అలాగే చిరు విశ్వంభర విడుదల తేదీ కోసం కాచుకుని కూర్చున్నారు. 

మరోపక్క ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమాలు, ఇక రామ్ చరణ్ పెద్ది, అల్లు అర్జున్-అట్లీ మూవీ, సూపర్ స్టార్ మహేష్ వారణాసి, నాగార్జున #KING100, వెంకీ ఆదర్శ కుటుంబం, నాని ప్యారడైజ్, రామ్, నితిన్ ఇలా యువ హీరోల కొత్త సినిమాల కబుర్లు కోసం అందరూ వెయిట్ చేసున్నా ఇందులో ఏ ఒక్కరూ తమ సినిమా అప్ డేట్ ఉగాదికి ఉంటుంది అని ప్రకటించడం లేదు.

అసలు ఈ ఉగాది కి పెద్ద సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ అప్ డేట్స్ ఇస్తారా, ఇస్తే ఇంత సైలెంట్ ఎందుకు, కొంపదీసి ఉగాదిని చప్పగా పంపెయ్యారు కదా అంటూ కామన్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Tollywood - Ugadi:

Tollywood - Ugadi 2026
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs