టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న `పెద్ది` సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో కేవలం ఒక హీరోయిన్‌ను మాత్రమే తీసుకోవాలా ? ఇద్దరు భామలతో స్టెప్పులు వేయించాలా? అనే విషయంలో దర్శకుడు బుచ్చిబాబు తన గురువు, లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తారో అందరికీ తెలిసిందే. `ఆర్య` నుంచి `పుష్ప` వరకు ఆయన మార్క్ ఐటమ్ సాంగ్స్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి. అందుకే తన సినిమాలో కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ఉండాలని బుచ్చిబాబు భావిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయంపై సుకుమార్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రామ్ చరణ్ లాంటి గ్రేట్ డాన్సర్ పక్కన ఇద్దరు భామలు ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని కొందరు అంటుంటే? ఒక్కరే ఉంటే ఫోకస్ బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి ఈ ఐటమ్ సాంగ్ విషయంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇద్దరు భామలను తీసుకోవాలని నిర్ణయిస్తే? టాలీవుడ్‌లో అది ఒక క్రేజీ ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పాట కోసం పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గురువు సుకుమార్ ఇచ్చే గైడెన్స్‌తో బుచ్చిబాబు ఈ సాంగ్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడం ఖాయమని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.