Advertisement
Google Ads BL

బాలీవుడ్‌కు నియంత్రణ విధించాల్సిందే!


బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెరుగుతున్న అశ్లీలతపై ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సినిమా రంగాన్ని అథఃపాతాళానికి దిగజారుస్తున్నారని, చౌకబారు ట్రిక్కులతో హద్దులు దాటుతున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. అశ్లీలతను ప్రోత్సహిస్తున్న తీరును దేశమంతా చీద‌రించుకుంటున్నా, పరిశ్రమ వర్గాల్లో మార్పు రాకపోవడం సిగ్గుచేటని కంగనా మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌కు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం కచ్చితంగా బాలీవుడ్‌పై కఠినమైన నియంత్రణ విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement
CJ Advs

ఈ వివాదం `కేడీ.. ది డెవిల్ అనే కన్నడ చిత్రం కోసం రూపొందించిన హిందీ పాటతో మొదలైంది. నోరా ఫతేహి నటించిన ఈ పాటలోని సాహిత్యం అత్యంత పచ్చిగా, అసభ్యకరమైన డబుల్ మీనింగ్ డైలాగులతో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ సైతం కమర్షియల్ సాంగ్స్ ఇంతలా దిగజారిపోవడం బాధాకరమంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో చిత్ర బృందం ఆ పాటను ఇప్పటికే యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది.

ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాకుండా న్యాయపరమైన మలుపు కూడా తీసుకుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ పాటలోని అభ్యంతరకర అంశాలను సీరియస్‌గా తీసుకుని చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. ఒకవైపు కంగనా వంటి ప్రముఖులు సెన్సార్‌షిప్ కఠినం చేయాలని కోరుతుండగా, మరోవైపు మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో కమర్షియల్ సినిమాల మేకింగ్ , పాటల చిత్రీకరణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Kangana Ranaut blasts Bollywood:

Kangana Ranaut 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs