మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో ఓ భారీ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాటకు ఏ.ఆర్. రెహమాన్ అదిరిపోయే బాణీని సమకూర్చారు. అయితే ఈ పాట చిత్రీకరణ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ బాటలో నడుస్తారా? లేక రాజమౌళి శైలిని అనుసరిస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కోసం ఒకే ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంచుకుంటారు. ఆ పాటను సినిమాకే హైలైట్‌గా మారుస్తుంటారు. `పుష్ప`లో సమంత, `రంగస్థలం`లో పూజా హెగ్డే ఆ పాటలతో ఎంత సంచలనం అయ్యారో? తెలిసిందే. ఇప్పటికే బుచ్చిబాబు తన గురువు లాగే మృణాల్ ఠాకూర్ ని రంగంలోకి దించనట్లు వార్తలొస్తున్నాయి. సింగిల్ హీరోయిన్‌తో ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు ఒక వాదన వినిపిస్తోంది. కానీ క్లారిటీ లేదు.
మరో వెర్షన్ ఏంటంటే? ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ముగ్గురు స్టార్ హీరోయిన్లు స్టెప్పులు వేయబోతున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో రాజమౌళి తన `బాహుబలి` సినిమాలో ఇరుక్కో పాటను పాటతో ట్రెండ్ సెట్ చేసారు. ఆ పాట మంచి సక్సెస్ అయింది. ఒకే పాటలో ముగ్గురు భామలు కనిపిస్తే ఆ విజువల్ గ్రాండియర్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ మాటను కూడా బుచ్చిబాబు కొట్టి పారేయలేకపోతున్నాడు అన్నది మరో వెర్షన్. మరి పెద్ది ఐటమ్ సాంగ్ విషయంలో బుచ్చిబాబు గురువు శైలిని ఫాలో అవుతాడా? లేక రాజమౌళి తరహాలో భారీతనాన్ని జోడిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.