సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం అభిమానుల మీటింగ్స్ కూడా పెట్టారు. ఆతర్వాత రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న సమయంలో ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా పొలిటికల్ ఎంట్రీ కి రజినీకాంత్ గుడ్ బై చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు.
ఆతర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ జర్నీ మొదలయ్యింది. విజయ్ పార్టీ పెట్టారు. ఈ ఏడాది తమిళనాట ఎన్నికల్లో విజయ్ పార్టీ సింగిల్ గానే పోటీ చేయబోతుంది. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పై TVK పార్టీ నేతలు అంటే విజయ్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై రజినీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ పార్టీ నేత అధవ్ అర్జున్.. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చూసినప్పుడు DMK నుంచి ఆయనకు థ్రెట్స్ వచ్చాయని అందుకే ఆయన రాజకీయాల్లోకి రాలేదని అన్న అర్జున్.. అలాంటి ఒత్తిళ్లను తట్టుకుని పాలిటిక్స్ లోకి వచ్చిన ధైర్యం విజయ్ కి ఉందని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
దానితో సూపర్ స్టార్ డైరెక్ట్ గానే సమయం సరిపోకపోవచ్చు, కానీ అది వేచి ఉండి సమాధానం ఇస్తుంది అంటూ విజయ్ పై వేసిన పవర్ ఫుల్ పంచ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో వేడిని రాజెయ్యగా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ విజయ్ పై ఆయన పార్టీ పై ఫైర్ అవుతున్నారు.