Advertisement
Google Ads BL

దురంధ‌ర్ -2 ఓపెనింగ్స్ 100 కోట్లు


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న దురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల రూపాయల మార్కును దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించ‌నుంద‌ని ట్రేడ్ చెబుతోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రీమియర్ షోలు , మొదటి రోజు కలిపి సుమారు 72.75 కోట్ల రూపాయల గ్రాస్‌ను ఇప్పటికే సాధించింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే కేవలం ఓపెనింగ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే మొదటి రోజే 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టడం ఈ సినిమాకు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
CJ Advs

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఊహించని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం ఇప్పటికే 4.30 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించి ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న భారీ ఆదరణతో రెండు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా దురంధర్ 2 అవతరించింది. గతంలో ఉన్న పలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డులను ఇది అధిగమించడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా `దురంధర్ 2` సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఉత్తర అమెరికాలో 2.21 మిలియన్ డాలర్లు, మిగతా దేశాల్లో 690 వేల డాలర్లతో కలిపి ఓవర్సీస్‌లోనే సుమారు 26.85 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అమెరికాలో పఠాన్, RRR వంటి భారీ చిత్రాల రికార్డులను సైతం ఇది బ్రేక్ చేయడం గమనార్హం. దేశీయంగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక వసూళ్లు నమోదవుతున్నాయి. 

గల్ఫ్ దేశాల గణాంకాలు ఇంకా చేరకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇదే పాజిటివ్ టాక్ కొనసాగితే చైనా మార్కెట్‌తో సంబంధం లేకుండా భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ మార్కును అందుకునే చిత్రంగా దురంధర్ 2 నిలిచే అవకాశం ఉంది.

Dhurandhar 2 Openings:

Dhurandhar The Revenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs