క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ పై కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా నేపధ్యమేమిటో వెంకీ అట్లూరి ఆల్మోస్ట్ రివీల్ చేసారు. ఇప్పడు టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.
టీజర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్ పాత్రలో సూర్య కనిపించారు. షూటర్ గా సక్సెస్ ఫుల్ గా 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా సూర్య పాత్రను పరిచయం చేశారు. ఇక హోదా అంతస్తు కోసం కలలు కనే మ్యాడి. ఓ పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టయిల్, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టాలి.. అలా రిచ్ గా సెటిల్ అవ్వాలని ఎయిమ్ తో హీరోయిన్ కాయదు లోహర్ కనిపిస్తుంది.
అందుకోసం తనకన్నా వయసులో పెద్దవాడైన సూర్య వెంట పడుతుంది. పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతుంది. సూర్య 40 ఏళ్ళ వయసున్న విశ్వనాథ్ అనే షూటర్ గా తండ్రి ప్రేమ, ఎమోషన్స్ రెండూ కలిసిన ఒక బలమైన పాత్రలో కనిపిస్తున్నారు. సూర్య తల్లి పాత్రలో రాధికా కనిపించారు.
అల్లరిపిల్లగా కాయదు ఆకట్టుకుంది. రిచ్ సెటప్, వెంకీ అట్లూరి దర్శకత్వం, సితార ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అన్ని విశ్వనాధ్ అండ్ సన్స్ టీజర్ లో హైలెట్ అయ్యాయి.