Advertisement
Google Ads BL

ఆస్కార్ చరిత్రలో అరుదైన ఘటన!


లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ సాక్షిగా 98వ ఆస్కార్ వేడుకల్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దాదాపు 98 ఏళ్ల అకాడమీ చరిత్రలో కేవలం ఏడోసారి ఒకే కేటగిరీలో ఇద్దరు విజేతలు నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ అరుదైన టై చోటుచేసుకోవడంతో సినిమా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఈ విభాగంలో విజేతను ప్రకటించడానికి వేదికపైకి వచ్చిన నటుడు కుమాయిల్ నంజియాని, ఎన్వలప్ తెరవగానే ఒక్క క్షణం అవాక్కయ్యారు. లోపల ఇద్దరి పేర్లు ఉండటంతో.. ఈ కేటగిరీలో టై అయ్యింది.. ఇద్దరు విజేతలు ఉన్నారు అని ఆయన ప్రకటించగానే హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది. `ది సింగర్స్‌` మరియు `టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా` చిత్రాలు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా స్టేజ్ పైన చిన్నపాటి కామెడీ కూడా జరిగింది. షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడానికి ఇంత సమయం పట్టడం వింతగా ఉంద‌ని  కుమాయిల్ చమత్కరించగా, హోస్ట్ కోనన్ ఓబ్రియన్ దానికి మరింత మసాలా జోడించారు. ఈ టై వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ బెట్టింగ్ వేసిన 22 మిలియన్ల మంది పరిస్థితి ఏంటి?" అంటూ ఆయన వేసిన జోక్‌కు డాల్బీ థియేటర్ నవ్వులతో దద్దరిల్లింది. ఏదేమైనా  ఊహించని పరిణామం 2026 ఆస్కార్ వేడుకల్లో ఒక హైలైట్‌గా నిలిచిపోయింది.

Oscars 2026 Update:

Oscars 2026 - Winners, surprises and full results from the 98th Academy Awards
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs