టాలీవుడ్ స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం కెరీర్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. డీజే టిల్లు సిరీస్‌తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న సిద్ధుకు 2025 సంవత్సరం మాత్రం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ ఏడాది విడుదలైన ఆయన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయాయి. దీంతో తదుపరి చిత్రాల ఎంపిక విషయంలో సిద్ధు రూటు మార్చినట్లు కనిపిస్తోంది. కథా చర్చల నుండి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జెతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పరాజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో, దీని అవుట్‌పుట్ విషయంలో సిద్ధు ఎక్కడా రాజీ పడటం లేదు. కేవలం నటుడిగానే కాకుండా, స్క్రిప్ట్ వర్క్‌లో కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటూ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
సిద్ధు కేవలం అనుభవజ్ఞులైన దర్శకులకే కాకుండా? కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నారు. తాజాగా మరో కొత్త కుర్రాడు చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించాలని సిద్ధు ప్లాన్ చేస్తున్నారు. 2026లో తన లైనప్‌తో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద టిల్లు బాబు మేజిక్ రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.