రణ్ వీర్ సింగ్ `దురంధర్` ఫ్రాంఛైజీని యూనివర్శ్ గా మారుస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దురంధర్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రెండో భాగాన్ని దురంధర్ 2ని ఈనెల 19న థియేటర్లలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు ఆదిత్యాధర్. ఈ సమయంలో జియో సినిమాస్ అభ్యర్థన మేరకు అతడు దురంధర్ 3ని తెరకెక్కిస్తాడు అంటూ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు కూడా సాగుతున్నాయన్న గుసగుస వేడెక్కించేస్తోంది.
అయితే దురంధర్ చిత్రాన్ని కేవలం రెండు భాగాలుగా పూర్తి చేస్తానని ప్రకటించిన ఆదిత్యాధర్ ఇప్పుడు మూడో భాగం కథను ఎలా యాడప్ చేస్తాడనేదే సస్పెన్స్ గా మారింది. దురంధర్ కథలో కథానాయకుడి పాత్ర ఫిక్షనల్ కాబట్టి మూడో భాగానికి ఆస్కారం ఉందా? అన్నది వేచి చూడాలి. దీని గురించి ఆదిత్యాధర్ ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాల్ని చెప్పలేదు.