క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ శ్రీలీల ఈమధ్యనే ఎంబిబిఎస్ పట్టా అందుకుని డాక్టరై పోయింది. అటు యాక్టర్ ఇటు డాక్టర్ గా క్రేజీ గా మారిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో విషమ పరిక్ష కు సిద్దమైంది. మార్చి 19 న ఉగాది స్పెషల్ గా విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితేనే అమ్మడుకు తెలుగులో భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కష్టమే.
మరోపక్క తమిళనాట శ్రీలీల హవా పెరిగిపోయింది. వరసగా కోలీవుడ్ స్టార్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుని టాప్ హీరోయిన్స్ కి పోటీగా తయారైన శ్రీలీల కు అటు హిందీలోనూ మంచి మంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అక్కడ యువ హీరో కార్తీక్ ఆర్యన్ తో బ్యా టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ షోస్ తో హడావిడి చేసే శ్రీలీల ఈమధ్యన చీరకట్టులో మెస్మరైజ్ చేస్తుంది. రీసెంట్ గా టాలీవుడ్ ఈవెంట్స్ లో అదిరిపోయే శారీ లో దర్శనమిచ్చిన శ్రీలీల తాజాగా షేర్ చేసిన పిక్ చూసి చీరకట్టులో శ్రీలీల చిలిపి అల్లరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.