Advertisement
Google Ads BL

ఇది తెలుగోళ్ల కాన్ఫిడెన్స్


ఇరాన్ యుద్ధం మొదలయ్యాక LPG గ్యాస్ సిలిండర్లు కొరత ఏర్పడింది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ని నిలివేసి గృహోపకరణాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంతో పలు నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ అన్ని మూతబడుతున్నాయి. మరోపక్క సామాన్యులు LPG బుకింగ్స్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒణికిస్తున్నారు. గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం మినీ యుద్ధమే చేస్తున్నారు.

Advertisement
CJ Advs

కరోనా మాదిరి మరోసారి లాక్ డౌన్ తప్పదు, కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే అటు పెట్రోల్ ఇబ్బందులు తప్పుతాయి. హాస్టల్స్ వాళ్ళు ఖాళీ చేసి ఇంటికెళిపోతారనే చర్చ మొదలైంది. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎప్పటివరకు జరుగుతుందో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్విస్తున్నాడు తప్ప క్లారిటీ ఇవ్వడమే లేదు. దానితో గ్యాస్ సంక్షోభం మరింతగా ముదిరే అవకాశం కనిపిస్తుంది.

దానితో చాలామంది గ్యాస్ బదులుగా కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే పలు హోటల్స్ లో ఈ రకమైన కట్టెల పొయ్యి పెట్టి కస్టమర్స్ కి ఫుడ్ అందిస్తున్నారు.

అది చూసిన చాలామంది సోషల్ మీడియాలో 

గ్యాస్ లేకపోతేనేమి..

కట్టెల పొయ్యిలూ.. కిరసనాయిల్ స్టవ్లూ...

ఒక వేళ కరెంట్ కూడా కొన్నిరోజులు లేకపోతే

గూట్లో కిరసనాయిల్ బుడ్లూ...

ఎర్రబస్సుల్నీ చూసాం, ఎయిర్ బస్సుల్నీ చూసాం..

కరోనానే దాటాం.. యుద్ధాలేపాటివీ?!

ఏం పర్లేదు...ఎలాగోలా బ్రతికేస్తాం.. అంటూ చేస్తున్న ట్వీట్లు చూసి నిజమే కదా.. బ్రతకడం అనేది ఎలాగోలా బ్రతికేస్తాం. గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు అని జన జీవనం స్తంభించి పోదు, ఏదోలా వాటిని అధిగమిస్తాం అనే కాన్ఫిడెంట్ ఉంటె చాలు. 

Telugu States:

LPG Gas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs