Advertisement
Google Ads BL

ప్లీజ్ వదిలెయ్యండి సారీ.. రాజేంద్ర ప్రసాద్


సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమా ఈవెంట్స్ లో ఏదో ఒకటి మాట్లాడి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారడమే కాదు తర్వాత అలా మాట్లాడను అంటూ క్షమాపణలు చెప్పడం.. ఆతర్వాత మళ్లీ మళ్లీ అలాంటి మాటలే ఆయన్ని తీవ్ర విమర్శల పాలు చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తమిళ నటుడు, Ex CM ఎంజీఆర్ తెలుగు నటుడు కత్తి కాంతారావు ని చూసి భయపడేవారు అంటూ చేసిన కామెంట్స్ తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపాయి. నటుడు విశాల్, తమిళ నడిగర సంఘం అంతా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు.

దానితో రాజేంద్ర ప్రసాద్ చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు. తమిళంలో మాట్లాడే వీడియో షేర్ చేస్తూ.. తమిళ సినిమా దేవుడిగా భావించే MGR గురించి హాస్యాస్పదంగానే అన్నాను. ఎంజీఆర్ ని విమర్శించేంత ధైర్యం నాకు ఉందా.. ఎవరైనా ఈ వ్యాఖ్యలకు బాధపడి ఉంటే క్షమించమని అభ్యర్థిస్తున్నా. ఇంకెప్పుడూ అలా మాట్లాడను. ఈ సమస్యను ఇక్కడితో వదిలేయండి అంటూ రాజేంద్ర ప్రసాద్ ఆ వీడియో లో క్షమాపణలు కోరారు. 

Rajendra Prasad Apologizes :

Rajendra Prasad Apologizes After His Comments on MGR 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs