Advertisement
Google Ads BL

అన్నదాత సుఖీభవకు విశేష స్పందన


కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలనే కాదు మిగతా హామీలను కూడా విడతల వారీగా నెరవేరుస్తుంది, అమలు చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది కానుకగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0 పథకంలో భాగంగా ఈరోజు మార్చి 13 న నిధులు విడుదల చేసింది.

Advertisement
CJ Advs

ఈ విడతలో ఏకంగా 46.85 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0 పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేయనుంది. దానితో ఒక్కో రైతుకి ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది . కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000..

రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఈ శుక్రవారంతో కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చంద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0 పథకంలో భాగంగా చెక్కులు పంపిణి చెయ్యనున్నారు.

ఈ పథకాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడంపై ఏపీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేసారుస్తుంది.. తమను అన్నివేళలా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞలు తెలియజేస్తున్నారు. 

Annadata Sukhibhava:

Annadata Sukhibhava funds release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs