నందమూరి నటసింహ బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో రెండో మూవీ గా తెరకెక్కుతున్న NBK 111 చిత్ర రెగ్యులర్ షూటింగ్ సైలెంట్ గా మొదలైంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
ప్రస్తుతం అల్యుమియం ఫ్యాక్టరీలో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని కీలకమైన జేసీబీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తుంది.. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ లో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య ఇంకా కీలక నటులు రాత్రి ఎఫెక్ట్‌లో ఈ ఫైట్ సీన్ షూట్ లో పాల్గొంటున్నారు.
ఈ షెడ్యూల్ ఉగాది వరకు కొనసాగుతుంది అని ఈ సినిమాలో ఈ జేసీబీ సీన్ హైలైట్ గా నిలవనుంది అని సమాచారం. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తాడని టాక్ ఉండగా.. హీరోయిన్ నయనతార బాలయ్య తో మరోసారి జోడి కడుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్ గా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.