Advertisement
Google Ads BL

గుండెల్ని పిండేసేలా పౌజీ క్లైమాక్స్!


ప్రభాస్ క‌థానాయ‌కుడిగా  హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఫౌజీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా  ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్ర ముగింపు ఘట్టాలు కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా, గుండెలను పిండేసే బలమైన ప్రేమ ఉద్వేగాలతో సాగుతాయని తెలుస్తోంది. యుద్ధ భూమిలో జరిగే భీకర పోరాటాన్ని, ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన వేదనను  హను రాఘవపూడి అద్భుతంగా మేళవించినట్లు సమాచారం.

Advertisement
CJ Advs

ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్. ప్రభాస్ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా  భావోద్వేగపూరితమైన నటనను ఇందులో కనబరిచారని అంటున్నారు. ఒకవైపు కర్తవ్యం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రేమ మధ్య నలిగిపోయే సైనికుడి ఆవేదనను హను  వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయమ‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది. యుద్ధం ముగిసినా ఆ ప్రేమ కథ ఇచ్చే ఇంపాక్ట్ ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండిపోతుంద‌ని యూనిట్ నుంచి లీకైంది.

క్లైమాక్స్ సన్నివేశాలకు విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం  ప్రాణం పోస్తుంద‌ని చెప్పొచ్చు. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ సమపాళ్లలో మ‌లిచి   ఓ ఎపిక్ ముగింపునే రాసిన‌ట్లు తెలుస్తోంది.  `సీతా రామం` క్లైమాక్స్‌తో ఎమోషనల్‌గా కదిలించిన హను, ఈసారి ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అంతకంటే రెట్టింపు స్థాయిలో ఎమోషన్స్ పండించబోతున్నారు. ఈ క్లైమాక్స్ చూశాక ప్రభాస్ కేవలం మాస్ హీరో మాత్రమే కాదు. ఓ గొప్ప నటుడని కూడా అంతా కీర్తించే స్థాయిలో ఉంటుందంటున్నారు.

Interesting news on Fauzi climax:

Prabhas Fauzi update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs