మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ ల కలయికలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం విడుదల తేదీ కోసం మెగా ఫ్యాన్స్ ని మేకర్స్ తెగ వెయిట్ చేయిస్తున్నారు. గత ఏడాదిన్నరగా విశ్వంభర విడుదల ఇదిగో అదిగో అనడమే కానీ సీజీ వర్క్ కారణంగా ఇప్పటివరకు మేకర్స్ విడుదల తేదీని ప్రకటించడం లేదు.
తాజాగా విశ్వంభర డిజిటల్ రైట్స్ కోసం జీ 5 పోటీపడుతోందని తెలుస్తుంది. వసిష్ఠ - కళ్యాణ్ రామ్ ల బింబిసార చిత్రాన్ని, అలాగే రీసెంట్ గా మెగాస్టార్ చిరు నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల ఓటీటీ హక్కులను దక్కించుకుని లాభపడిన జీ 5 ఇప్పుడు చిరు-వసిష్ఠ ల విశ్వంభర హక్కులను వదులుకోకూడదని డిసైడ్ అయ్యి మంచి డీల్ పెట్టినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం జీ 5 తో విశ్వంభర మేకర్స్ చర్చలు జరుపుతున్నారని, ఈ వారంలోనే దాదాపుగా విశ్వంభర ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జీ 5 పెట్టిన ఫ్యాన్సీ డీల్ నచ్చితే విశ్వంభర మేకర్స్ జీ 5 కి డిజిటల్ హక్కులను ఇచ్చేసి సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేస్తారని మీడియా సర్కిల్స్ టాక్.