మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ కాదు కాదు ఎప్పుడో మొదలైన మూవీ విశ్వంభర. దర్శకుడు వసిష్ఠ షూటింగ్ పూర్తి చేసినా సీజీ వర్క్ అంటూ విడుదల తేదీ ఇవ్వకుండా నాన్చుతున్నారు. చిరు జూన్ లో లేదా జులై లో విశ్వంభర రిలీజ్ ఉండొచ్చనే వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడమే లేదు. ఈలోపే కెమెరా మ్యాన్ చోట కే నాయుడు విశ్వంభర పై చేసిన కామెంట్స్ ఇప్పుడు అనుమానాలకు తావిచ్చాయి.
సీజీ వర్క్ ఎక్కువ శాతం ఉన్న సినిమాల్లో కెమెరా మ్యాన్స్ కి పెద్దగా పని ఉండదు, సీజీ వర్క్ సరిగ్గా రాకపోయినా కెమెరా మ్యాన్ ను తప్పుబట్టకూడదు, దర్శకుడు చెప్పిందే చేస్తాం, క్వాలిటీ సరిగ్గా లేకపోతె అది మా తప్పు కాదు. మెగాస్టార్ అంజి సినిమాకి తల ఎత్తుకుని పని చేసిన నేనే ఇప్పుడు విశ్వంభరకు తల వంచుకుని చేయాల్సి వస్తోంది..
విశ్వంభర కు రూ.400 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అలాంటి సినిమా విషయంలో నా మాటే చెల్లుబాటు కావాలనే ధోరణి ఇక్కడ పనికి రాదు.. అంటూ చోట కే నాయుడు ఓ సినిమా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు చూసిన వారు అసలు విశ్వంభర విషయంలో ఏం జరుగుతుంది.. అసలే సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇలాంటి అనుమానాలకు తావివ్వడం ఏమిటి..
అసలు చోట కే ఎందుకు ఇలా మట్లాడారు అంటూ అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై దర్శకుడు వసిష్ఠ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.