బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన డిమోన్ పవన్ కి కండ బలం ఉన్నా బుద్ది బలం లేకపోవడం మైనస్ అయ్యింది, అంతేకాకుండా డిమోన్ పవన్ రీతూ తో హద్దు మీరి ఫ్రెండ్ షిప్ చెయ్యడం అతనికి డ్యామేజ్ అయ్యింది. సీజన్ 9 విన్నర్ అవుతాడనుకుంటే టాప్ 3 తో సరిపెట్టుకున్నాడు. ఒకొనొక సమయంలో అతను టాప్ 5 లో ఉంటాడా అనే డిస్కర్షన్ కూడా జరిగింది.
టాప్ 3 నుంచి అతను 15 లక్షల మనీ సూట్ కేస్ తీసుకుని బయటికి వచ్చేసాడు. అయితే డిమోన్ పవన్ అలా క్యాష్ సూట్ కేస్ తీసుకోవడం వెనుక అతని తండ్రి అనారోగ్యమే కారణమన్నారు. డిమోన్ పవన్ తండ్రి త్రోట్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు. ఆయన అనారోగ్యం కారణంగానే పవన్ హౌస్ లో బాధపడేవాడు. ఆయన బిగ్ బాస్ స్టేజ్ పైకి కూడా వచ్చారు.
అయితే డిమోన్ పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి దుర్గాప్రసాద్ మార్చి 10, 2026న కన్నుమూశారు. దానితో డిమోన్ పవన్ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.