Advertisement
Google Ads BL

అదే నిజమైతే మిల్కి బ్యూటీ లక్కీనే


ఓదెల 2 తర్వాత టాలీవుడ్ లో అంతగా వినిపించని పేరు మిల్కి బ్యూటీ తమన్నా. బాలీవుడ్ లోనో లేదంటే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న తమన్నా ని తెలుగు హీరోలు లైట్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో బ్రేకప్ తర్వాత బిజినెస్ లో దూసుకుపోతున్న తమన్నా పేరు తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

గతంలో బెంగాల్ టైగర్ లో తమన్నా రవితేజ తో రొమాన్స్ చేసింది. ఆ చిత్రంలో రాశి ఖన్నా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా మరోమారు రవితేజ తో కలిసి నటించబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది. రవితేజ లేటెస్ట్ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇరుముడి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఓ హీరోయిన్ గా ప్రియా భవాని నటిస్తుంది.

ఇప్పుడు మరో హీరోయిన్ గా తమన్నా కూడా కనిపించే ఛాన్స్ వుంది అంటున్నారు. ఇదే గనక నిజమైతే టాలీవుడ్ కెరీర్ ఖతమైపోతున్న తరుణంలో తమన్నా కు లక్కీ ఛాన్స్ వచ్చినట్టే. చూద్దాం రవితేజ ఛాన్స్ ఇస్తారో, ఎవ్వరో అనేది. 

Tamannaah Bhatia in Irumudi:

Tamannaah Bhatia in Ravi Teja Irumudi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs