Advertisement
Google Ads BL

ఇండియా నుంచి మొట్ట మొద‌టి చిత్ర‌మిదే!


అంటార్కిటికా ఖండంలో షూటింగ్ అంటే ఆషామాషీ కాదు. ఎన్నోక‌ఠిన‌మైన‌ స‌వాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యంత శీతలమైన ప్రాంతం కావడంతో షూటింగ్ చేయడానికి కఠినమైన పర్యావరణ నిబంధనలు అమ‌లులో ఉంటాయి. ఈ కార‌ణంతో ఇప్పటి వరకూ ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో  షూటింగ్ జరుపుకున్న భారతీయ చిత్రాలు చాలా తక్కువ‌నే చెప్పాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన `జ‌న‌గ‌ణ‌మ‌న‌` సినిమాలోని కొన్ని సన్నివేశాలను అంటార్కి టికాలో చిత్రీకరించాలని మొదట ప్లాన్ చేశారు. కానీ వాతావరణ పరిస్థితులు , అనుమతులు దొర‌క‌ని కారణంగా  సాధ్యపడలేదు.

Advertisement
CJ Advs

అలాగే బాలీవుడ్ చిత్రం `క్రూ` లోని కొన్ని మంచు స‌న్ని వేశాలుంటాయి. వాటిని అంటార్కిటికాలో షూట్ చేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి.  కానీ అవి నేరుగా అంటార్కిటికా ఖండం లోపల జరిగినవి కావు.  ఐస్‌లాండ్ , గ్రీన్‌లాండ్ వంటి ప్రాంతాల్లో జరిగాయి. ఈ రెండు సినిమాలు మిన‌హా మ‌రే సినిమా షూటింగ్ కూడా అక్క‌డ జ‌ర‌గ‌లేదు. అయితే `వార‌ణాసి` చిత్రాన్ని మాత్రం నేరుగా అంటార్కిటికాలోనే ప్లాన్ చేసారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. మ‌హేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కి అక్క‌డ అనుమ‌తులు ల‌భించ‌డం షాకింగ్. ప్ర‌ధాన పాత్ర ధారుల‌పై అక్క‌డ రాజ‌మౌళి కొన్ని కీల‌క స‌న్నివేశాలు ప్లాన్ చేసారు.

అయితే షూటింగ్ డేస్ అనుమ‌తి ప‌రిమితంగానే ల‌భించింది. దీంతో వీలైనంత త్వ‌ర‌గా వాటిని పూర్తి చేసి రాజ‌మౌళి అండ్ కో వెను దిర‌గాలి. అనుమ‌తి ల‌భించ‌డానికి కార‌ణం కూడా రాజ‌మౌళి ఇన్ ప్లూయెన్స్ అని చెప్పొచ్చు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కున్న క్రేజ్ కార‌ణంగా స్థానిక ప్ర‌భుత్వం అనుమ‌తుల‌కు నిరాక‌రించ‌లేకపోయింది. అయితే మిడిల్ ఈస్ట్  దేశాల్లో  యుద్దం జ‌రుగుతోన్న స‌మ‌యంలో రాజ‌మౌళి అండ్ టీమ్ అంటార్కిటికా చేరుకోవాల్సి ఉంది. అయినా రాజ‌మౌళి వెన‌క్కి త‌గ్గ‌లేదు. అందుకోసం రాజ‌మౌళి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో సిద్ద‌మ‌వుతున్నారు.

యూరప్ వెళ్లే విమానాలు ఎక్కువగా దుబాయ్ మీదుగానే వెళ్లాల్సి ఉండటం, అక్కడ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో అందరూ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు , రాజమౌళి బృందం, దుబాయ్ మీదుగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇటీవ‌లే సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. అంటార్కిటికా షూటింగ్ కోసం నేరుగా దక్షిణ అమెరికాకు వెళ్లి అక్కడి నుండి అంటార్కిటికా చేరుకుంటారు. కాక‌పోతే ప్ర‌యాణ స‌మ‌యం ఎక్కువ అవుతుంది. ఎలాంటి యుద్ద వాతావ‌ర‌ణం లేక‌పోతే ఆ స‌మ‌యం చిత్ర యూనిట్ కు క‌లిసొచ్చేది.

Varanasi Movie :

Varanasi Movie Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs