ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదలైన విభిన్న ప్రేమ కథా చిత్రం కపుల్ ఫ్రెండ్లి. సంతోష్ శోభన్-మానస వారణాసి కలయికలో తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కపుల్ ఫ్రెండ్లి ని ప్రమోట్ చెయ్యడం అన్ని ఈసినిమాకి కలిసొచ్చాయి.
థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకున్న కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో కపుల్ ఫ్రెండ్లీ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కపుల్ ఫ్రెండ్లి ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే నెట్ ఫ్లిక్స్ కపుల్ ఫ్రెండ్లి ఓటీటీ డేట్ లాక్ చేసింది. మార్చ్ 13 నుంచి కపుల్ ఫ్రెండ్లీ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. ఇంకెందుకు ఆలస్యం థియేటర్స్ లో మిస్ అయిన ఈ లవ్ స్టోరీ ని ఓటీటీ లో వీక్షించేంయ్యండి.