యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు బెంగళూరు లోని ఓ ఆసుపత్రి ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు బారులు తీరారు. అంతేకాదు ఎన్టీఆర్ ని సీఎం అంటూ కటౌట్స్ పెట్టి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ కూడా కార్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చెయ్యడం.. ఇలా ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ మాత్రమే ట్రెండ్ అవుతున్నారు.
ఇక #NTRNeel కలయికలో తెరకెక్కుతున్న NTR 31 డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ విషయాలు ఏమైనా బయటికి వస్తే ఎగ్జైట్ అవ్వాల్సిన అభిమానులు ఇప్పుడు షాకవుతున్నారు. కారణం షూటింగ్ ఇంకా ఇంకా నడుస్తుంది.. అసలు ఫస్ట్ లుక్ ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు సినిమా చేస్తారనే ఆందోళన వారిలో కనిపిస్తుంది.
ఇక తాజాగా #NTRNeel మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మూడు భారీ సెట్ లు నిర్మాణం చేపట్టారట. అందులో ఒకటి విలన్ సెట్, ఒకటి ఇంటి సెట్.. ఆ భారీ సెట్స్ లోనే #NTRNeel మూవీ షూటింగ్ నలభై రోజులు పాటు లాంగ్ షెడ్యూల్ ఉండబోతుంది అని తెలుస్తుంది.
అది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఇంకా సెట్స్ వేసుకుంటూ భారీ షెడ్యూల్స్ పెడుతూ షూటింగ్ చేస్తున్నారు. అసలు #NTRNeel షూటింగ్ ఎప్పటికి ఫినిష్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అంటారో అనే టెన్షన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.