Advertisement
Google Ads BL

సైలెంట్ గా ఓపెన్ అయిన‌ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడి భార్య‌


బాలీవుడ్‌లో వర్కింగ్ అవర్స్, పని ఒత్తిడిపై ఇటీవ‌ల పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.సెట్స్‌లో కార్మికులు, టెక్నీషియన్లతో పాటు నటీనటులు కూడా 16 నుండి 18 గంటల పాటు విరామం లేకుండా పనిచేయాల్సి రావడంపై పలువురు సెలబ్రిటీలు బాహాటంగానే స్పందించారు. అక్షయ్ కుమార్ క్రమశిక్షణకు ,తక్కువ పని గంటలకు మద్దతు ఇస్తారు. రోజుకు 8 నుండి 10 గంటలు పనిచేస్తే చాలు. అంతకంటే ఎక్కువ పనిచేస్తే ఉత్పాదకత తగ్గుతుందని న‌మ్ముతారాయ‌న‌. ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా  సెట్స్‌లో పని గంటల విషయంలో బాలీవుడ్‌లో క్రమబద్ధత లేదని విమర్శించారు.

Advertisement
CJ Advs

పని వేళలు అస్తవ్యస్తంగా ఉంటాయని, దీనివల్ల క్రియేటివిటీ దెబ్బతింటుందని  అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న టెక్నీషియన్లు గంటల తరబడి నిలబడి పనిచేయడం అమానవీయం అని పేర్కొన్నారు. తాప్సీ కూడా  తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై గట్టిగానే స్పందించారు.నటీనటుల కంటే వెనుక ఉండే క్రూ మెంబర్స్ (లైట్ మెన్, అసిస్టెంట్స్) పరిస్థితి దారుణంగా ఉంటుందని, వారికి కనీస నిద్ర కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ షెడ్యూల్స్ మరింత ప్రొఫెషనల్ గా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.

పని ఒత్తిడి వల్ల వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల గురించి అర్జున్ కపూర్ మాట్లాడారు. 15-16 గంటల పని వల్ల శారీరక అలసట మాత్రమే కాదు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందన్నారు. దీపీకా ప‌దుకొణే కూడా ఈ అంశంపై గ‌ట్టిగానే స్పందించింది. ఆ కార‌ణంగా తెలుగులో ఓ పాన్ ఇండియా ఛాన్స్ కూడా కోల్పోయిన సంగ తెలిసిందే. తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్  కూడా త‌న బాణీని  వినిపించే ప్ర‌య‌త్నం చేసింది.

ఇలాంటి అంశాల‌పై మ‌హిళా న‌టుల స్పందిస్తేనే దాన్ని పెద్ద వివాదంగా చేస్తున్నార‌ని దీపికా ప‌దుకొణే  వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. ప‌ని విష‌యంలో న‌టులు..నిర్మాత‌లు మాట్లాడుకునే ఓ అండ‌ర్ స్టాండింగ్ వ‌చ్చిన త‌ర్వాతే ప‌ని చేస్తార‌ని ఇదంతా అందిరికీ తెలిసిన విష‌య‌మే అన్నారు. కానీ దీన్ని వివాదంగా మార్చి కొంద‌రు మాన‌సిక సంతృప్తి పొందుతున్నారంది. 

Yami Gautam on 8-hour work-shift demand for actors:

Yami Gautam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs