Advertisement
Google Ads BL

ఉస్తాద్ డోస్ పెంచారు


 

Advertisement
CJ Advs

ఈరోజు మార్చ్ 7 న బాలీవుడ్ హిట్ సీక్వెల్ ధురంధర్ 2 ట్రైలర్ ని చూసిన తెలుగు ప్రేక్షకులు.. ధురంధర్ 2 కి పోటీగా విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ డోస్ పెంచాలి, ప్రమోషనల్ కామెంట్ ను వదిలి సినిమాపై హైప్ పెంచకపోతే తెలుగులోనూ ధురంధర్ 2 ఓపినింగ్స్ కుమ్మేస్తాయి... అప్పుడు ఉస్తాద్ తో పవన్ పరువు పోతుంది అని చాలామంది మట్లాడారు.

ఇప్పుడు దర్శకుడు హరీష్ శంకర్ అడక్కుండానే ఉస్తాద్ నుంచి అదిరిపోయే గ్లింప్స్ ను వదిలారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే ఈ గ్లింప్స్ ట్రీట్ ఇచ్చారు, అలాగే పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పై అమాంతం అంచనాలు పెంచేసాయి. గ్లింప్స్ స్టార్ట్ అవడమే భగవద్గీత శ్లోకాలతో యాక్షన్ తో స్టార్ట్ అవ్వగా.. పవన్ మాస్ ఎంట్రీ తో ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు.. అంటూ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఈ గ్లింప్స్ కి హైలెట్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే పవర్ ఫుల్ డైలాగులు, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ అన్ని ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసాయి. మరి ఉస్తాద్ డోస్ పెంచు పెంచు అనగానే దర్శకుడు హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే గ్లింప్స్ వదిలి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

Ustaad Bhagat Singh Glimpse out:

Pawan Kalyan Stuns in the Powerful Glimpse of Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs