Advertisement
Google Ads BL

విజయ్ ను అల్లాడిస్తున్న భార్య సంగీత


రీసెంట్ గా కోలీవుడ్ లో ఓ క్యూట్ కపుల్ విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమ 26 ఏళ్ళ వివాహ బంధానికి హీరో విజయ్ భార్య సంగీత స్వస్తి చెప్పేందుకు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వెయ్యడం సంచలనంగా మారింది. ఓ నటి తో విజయ్ సన్నిహితంగా ఉంటూ, తనని మానసికంగా క్షోభ పెడుతున్నారు అంటూ తనకు విడాకులు ఇప్పించమని సంగీత కోర్టులో పిటిషన్ వేసింది.

Advertisement
CJ Advs

ఆతర్వాత సంగీత ఆరోపణలే నిజం అనుకునేలా విజయ్ హీరోయిన్ త్రిష తో క్లోజ్ గా మూవ్ అవుతూ చెన్నై లోని ఓ వివాహానికి హాజరవడం అన్ని హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్-త్రిష విషయంలో కొన్నాళ్లుగా విజయ్ కు సంగీత కు మనస్పర్ధలొచ్చాయని, కొన్నాళ్లుగా విజయ్-సంగీత విడివిడిగా ఉంటున్నారని తెలుస్తుంది.

తాజాగా విజయ్ భార్య సంగీత కోర్టులో మరో పిటిషన్ వేసినట్లుగా సమాచారం. తనను ఇంట్లోకి రానివ్వకుండా విజయ్ అడ్డుకుంటున్నారని, విడాకుల కేసు పరిష్కారమయ్యే వరకు విజయ్ నీలాంకరై ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కోరుతూ ఆమె చెంగల్పట్టు కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విడాకుల విషయంలో విజయ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. 

Sangeeta files petition alleging that Vijay:

Sangeetha filed for d!vorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs